(Local) Sat, 24 Jul, 2021

హుజూర్‌నగర్ గడ్డపై కారు జోరు

October 24, 2019,   4:31 PM IST
Share on:
హుజూర్‌నగర్ గడ్డపై కారు  జోరు

కాంగ్రెస్ పార్టీ కంచుకోట హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది.హోరా హోరిగా సాగిన ఉపపోరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం వరించింది. కౌంటింగ్ ముగిసే సమయానికి 43,624 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీని కైవసం చేసుకున్నారు. శానంపూడి సైదిరెడ్డికి 94,102 ఓట్లు రాగా, పద్మావతికి 58,199 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి 1,906, టీడీపీ అభ్యర్థి 1,513 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. మరోవైపు కౌంటింగ్ పూర్తి కాకుండానే కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. 10వ రౌండ్‌లోనే ఆమె బయటకు వెళ్లారు. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.