
తెలంగాణలో ఆర్టీసి కార్మికులను సర్కార్ ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆవేదన చెందిన ఓ ఆర్టీసి కార్మికుడు సీఎం కేసీఆర్ కు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖ రాశాడు. మీరేంది తీసేది నేనే పోతున్నానంటూ కండక్టర్ ఆవేదనతో లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశమిది…
"గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ....
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ మీలాంటి గొప్ప మనిసి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా.. కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా గా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను.
మీకు మాట తప్పడం మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు. అని మా కార్మిక లోకం లేట్ గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.
దీనికి కారణం లేకపోలేదు సర్. మా తెలంగాణ లో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న. కానీ సర్ 20 మందికి పైగా ఆర్టీసి కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు సర్. కానీ మీ బంగారు తెలంగాణ లో అది సాధ్యం అయింది సర్. నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజు నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్న సర్.
కానీ ఒక్కటి మాత్రం నిజం సర్ నా ఆర్టీసి అక్కా చెల్లెల్ల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది సర్, నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసి కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న. నా పేరు యల్.కృష్ణ. నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్.
నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్య సీఎం సర్ గారు మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సర్ RTC వాళ్ళు సర్ మీమ్ములను చాలా అభిమానించారు. సర్ కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా ఉహించి ఉండరు. సర్ వాళ్లకు వచ్చే 16000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు సర్.
మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంంటే మీ మీద గౌరవం తో ప్రాణాలు ఇచ్చేవారు సర్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులు అయిన సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు సర్. వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను హీనంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్.
ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ఈ లాఠీ దెబ్బలు ఏంది. నా ఆర్టీసి సోదరులు ఏమి తప్పు చేశారు అని ఇంకా ఎంత మందిని ఆత్మహత్యలు చేసుకునేట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను.
అందుకే నేను మీ బంగారు తెలంగాణా లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి. నా పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు."
ఇట్లు
ఎల్. కృష్ణ
స్టాఫ్ నెంబర్ 176822
ఆర్టీసి కండక్టర్, సూర్యాపేట డిపో.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.