(Local) Thu, 29 Oct, 2020

కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది: హైకోర్టు

November 26, 2019,   8:14 PM IST
Share on:
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరువల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని… సంబంధించిన సూసైడ్ నోట్ లను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. యూనియన్ నాయకులే సమ్మెకు పిలుపు నిచ్చారని, ఆత్మహత్యలకు యూనియన్ లీడర్లే బాధ్యత వహించాలని కోర్టు తెలిపింది. కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత తీసుకుంటుందని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై అన్ని విషయాలను జత చేసి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించింది. 

దీంతో పాటు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంపై న్యాయస్థానం ఎదుట పిటిషనర్ ప్రస్తావించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరి కొంతమంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారని ధర్మాసనం వద్ద పిటిషనర్ తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు.. కార్మికులను డిస్మిస్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు. కార్మికులను డిపోలకి అనుమతి ఇవ్వకపోడంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించింది. రేపు అఫిడవిట్ దాఖలు చేస్తామని న్యాయస్థానం ఎదుట పిటిషనర్ చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.