(Local) Mon, 27 Sep, 2021

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తో చర్చిస్తా: పవన్

October 31, 2019,   4:13 PM IST
Share on:
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తో చర్చిస్తా: పవన్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ కు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి, ఇతర కార్మికులు కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వీలైనంత త్వరగా సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 27 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా మొండిగా వెళ్లడం మంచిపద్ధతి కాదన్నారు. సీఎం కేసీఆర్ పై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. కేసీఆర్ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.