(Local) Mon, 27 Sep, 2021

ట్రక్కు ఆపరేటర్‌కు భారీ జరిమానా

September 15, 2019,   1:23 PM IST
Share on:
ట్రక్కు ఆపరేటర్‌కు భారీ జరిమానా

 ఒడిశాలోని శంబల్‌పూర్ జిల్లాలో ట్రక్కు ఆపరేటర్‌కు రూ.6,53,100 జరిమానా ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఇది రాష్ట్రంలో ఏకైక అత్యధిక జరిమానాగా చెబుతున్నారు. ఆగస్టు 10 నుంచి అమలు లోకి వచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం ఈ భారీ జరిమానా విధించారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన ఈ ట్రక్కు 2014 నుంచి క్వార్టర్లీ టాక్సు కట్టలేదు. టాక్సు చెల్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లు ఏవీ డ్రైవరు చూపించలేదని శంబల్‌పూర్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ లలిత్ మోహన్ బెహెరా చెప్పారు.పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్సు, ప్యాసింజర్లను తీసుకెళ్లడానికి పర్మిట్ ఇలాంటివేవీ లేకుండా అనేక విధాలుగా చట్టాన్ని ట్రక్కు ఆపరేటర్ ఉల్లంఘించారని బెహెరా వివరించారు. పన్ను బకాయిల మొత్తాన్ని రూ. 6,40,500గా అధికారులు లెక్కించారు. పర్మిట్ లేకుండా ప్యాసింజర్లను ట్రుక్కులో తీసుకెళ్తున్నందుకు చట్టం లోని సెక్షన్ 192 ప్రకారం ఒక్కొక్కరికి రూ 5000 వంతున పెనాల్టీ విధించారు. ఈ ట్రక్కు యజమాని నాగాలాండ్ లోని ఫెక్ పట్టణానికి చెందిన శైలేష్ శంకర్ లాల్ గుప్తాగా గుర్తించారు. పెనాల్టీ చెల్లించడానికి ట్రక్కు యజమాని రాకుంటే డిమాండ్ నోటీసు జారీ చేసి, తరువాత వేలం వేస్తామని చెప్పారు. ఒడిశా పబ్లిక్ డిమాండ్స్ రికవరీ చట్టం 1962 ప్రకారం ప్రాసిక్యూషన్ నిర్వహిస్తామని బెహెరా వివరించారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఆర్టీసీ కార్మికులు డెడ్ లైన్‌ లోపు డ్యూటీలో చేరకుం ...
ఆర్టీసీ కార్మికులు డెడ్ లైన్‌ లోపు డ్యూటీలో చేరకుం ...
బెంగుళూరులో రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు
బెంగుళూరులో రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.