(Local) Thu, 02 Apr, 2020

వరదను కూడా టిడిపి రాజకీయం చేస్తోంది

August 22, 2019,   3:01 PM IST
Share on:
వరదను కూడా టిడిపి రాజకీయం చేస్తోంది

చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోయాయని ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా అన్నారు . ఆయన అడుగు పెడితే కరువు  పరిస్థితులు ఉండేవని  కానీ ఇప్పుడు  జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రిజర్వాయర్లు అన్నీ నిండిపోయి రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే ఇది చూసి తట్టుకోలేకపోయిన చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని దుయ్యబట్టారు. వాళ్లను నీళ్లలో నిలబెట్టి మాట్లాడిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టిడిపి వీడియోల్లో మాట్లాుతున్న మనుషులు ఎవరో విచారణ చేస్తే నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఆశావర్కర్లు ధర్నా చేస్తే ఆ ఫొటోను కూడా టిడిపి నేతలు జగన్ కు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేత నారా లోకేశ్ చెప్పినట్లు ఓ పడవతో వరద నీటిని ఆపగలిగితే వేలాది కోట్లు పెట్టి డ్యాములు కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోకేశ్ తన తెలివితక్కువతనాన్ని ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నాడని రోజా విమర్శించారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.