(Local) Mon, 23 Sep, 2019

వరదలపై టిడిపి నేతలు చౌకబారు రాజకీయాలు - రోజా

August 21, 2019,   3:07 PM IST
Views: 117
Share on:
వరదలపై టిడిపి నేతలు  చౌకబారు రాజకీయాలు - రోజా

కరకట్ట వద్ద ఇల్లు కట్టకూడదనీ తెలిసి కూడా అప్పటి సిఎం చంద్రబాబు వినిపించుకోకుండా ఇల్లు కట్టారని ,అది అక్రమ కట్టడం క్రిందకి వస్తుందని  వైఎస్‌ఆర్‌సిపి నేత రోజా తెలిపారు. ఓ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసించారనీ, అందుకు ఆయన సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. వరద కారణంగా జరుగుతున్న నష్టం, ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు జలవనరుల శాఖ డ్రోన్ ను వాడితే, తన ప్రాణాలు తీయడానికి వాడినట్లు చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును తాము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదనీ, ఇప్పటికే ఏపీ ప్రజలు ఆయన్ను టార్గెట్ చేసి ఇంటికి పంపించారని సెటైర్ వేశారు. టీడీపీ నేతలు వరదలపై చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు చూడలేకపోతున్నారని రోజా చురకలు అంటించారు.

సంబంధిత వర్గం
ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారంపై విజయసాయిరెడ్డి ఫైర ...
ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారంపై విజయసాయిరెడ్డి ఫైర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.