(Local) Sun, 27 Sep, 2020

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు - ఈఓ

August 07, 2019,   11:45 AM IST
Share on:
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు - ఈ ...

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఐఆర్ఎస్ వారు దసరా మహోత్సవ ఏర్పాట్లలో భాగముగా భక్తుల సౌకర్యార్థం తీసుకొనవలసిన జాగ్రత్తలు, క్యూ-లైన్ నిర్వహణ,  ప్రత్యేక సేవలలో పాల్గొను ఉభయదాతలకు, విఐపీల దర్శనార్థం తీసుకొనవలసిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై విజయవాడ వెస్ట్ జోన్ సహాయ పొలిసు కమీషనరు కే సుధాకర్, 1-టౌన్ సీఐ డీ కాశివిశ్వనాద్ తో కలసి చర్చించారు. అనంతరం ఘాట్ రోడ్, మహామండపం ప్రాంతాలను, క్యూ–లైన్ లను ఏర్పాటు చేయవలసిన ప్రాంతాలను స్వయముగా పరిశీలించారు. సాదారణ భక్తులకు త్వరగా దర్శన సౌకర్యం మరియు వారికి క్యూ–లైన్లలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమములో I-టౌన్ ఎస్ఐ నాగేశ్వర రావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ డీ భాస్కర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
నేడు పారిస్‌లో రాఫెల్ కి ఆయుధ పూజ
నేడు పారిస్‌లో రాఫెల్ కి ఆయుధ పూజ
దుర్గమ్మ సన్నిధిలో తప్పిన ప్రమాదం
దుర్గమ్మ సన్నిధిలో తప్పిన ప్రమాదం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.