(Local) Tue, 10 Dec, 2019

శ్రీనగర్‌లో మరోసారి ఆంక్షలు

August 23, 2019,   3:52 PM IST
Share on:
శ్రీనగర్‌లో మరోసారి ఆంక్షలు

జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఈరోజు మరోసారి ఆంక్షలు విధించారు. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోఅధికరణ 370 రద్దుకి వ్యతిరేకంగా కొన్ని వేర్పాటువాద సంస్థలు నిరసనకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ సందర్భంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవని.. ప్రజలు సమూహాలుగా తిరగొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయం తరువాత రాష్ట్రవ్యాప్తంగా విధించిన ఆంక్షల్ని ఈ వారమే దశలవారీగా తొలిగించిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.