(Local) Mon, 12 Apr, 2021

కవిత బతుకమ్మకు రాకపోవుటకు కారణమిదేనా?

October 04, 2019,   11:09 AM IST
Share on:
కవిత బతుకమ్మకు రాకపోవుటకు కారణమిదేనా?

తెలంగాణలో ఊరూర బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆటాపాటలతో మహిళలు బతుకమ్మ వేడుకల్లో హుషారుగా  పాల్గొంటున్నారు. హైదరబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చాలా మంది మహిళా నేతలు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కుమార్తె, మాజీ ఎంపీ కవిత టాపిక్ చర్చనీయాంశమవుతోంది.

ప్రతి యేట బతుకమ్మ వేడుకల్లో కవిత ఉత్సాహంగా పాల్గొనేది. సామూహిక బతుకమ్మల పేరిట జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా కవిత బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

ఈ సారి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి గతంలో మాదిరిగా కవిత హాజరు కాకపోవడంతో పెద్దగా ప్రచారం జరగడం లేదు. అయితే గత ఎన్నికల్లో ఓటమితోనే కవిత మునుపటిలా బతుకమ్మ కార్యాక్రమాల్లో పాల్గొనడం లేదని కొందరు గుసగుసలాడుతున్నారు. బతుకమ్మ పండగను జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తం చేసిన కవిత ఈ యేడాది సామూహిక బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.