(Local) Mon, 23 Nov, 2020

గోదావరి నదికి మరోసారి భారీ వరద

August 21, 2019,   12:29 PM IST
Share on:
గోదావరి నదికి మరోసారి భారీ వరద

గోదావరి నదికి మరోసారి భారీ వరద పోటెత్తే అవకాశముందని ఏపీకి చెందిన ఆర్టీజీఎస్ హెచ్చరించింది. నేటి నుంచి రాబోయే 3 రోజులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే వరద తాకిడితో అల్లాడుతున్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తాజా వర్షాలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
కచ్చులూరు గోదావరిలో ఓ వ్యక్తి మొండెం లభ్యం
కచ్చులూరు గోదావరిలో ఓ వ్యక్తి మొండెం లభ్యం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.