(Local) Fri, 22 Oct, 2021

ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం

November 05, 2019,   11:34 AM IST
Share on:
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) లో చేరట్లేదని స్పష్టం చేశారు. RCEP లో చేరితే భారత్ లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో ప్రధాని ఈ వాణిజ్య ఒప్పందంపై..  భారత్ ఆందోళనతో దృఢ వైఖరి ప్రదర్శించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ వ్యక్తం చేసిన ఆందోళనకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చోటుచేసుకోనందున, దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై రాజీపడరాదని తాము నిర్ణయించినట్టు మోదీ తేల్చిచెప్పారని సమాచారం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.