(Local) Thu, 09 Jul, 2020

వైసీపీలోకి ...రాయపాటి సాంబ శివరావు

August 21, 2019,   1:31 PM IST
Share on:
వైసీపీలోకి ...రాయపాటి సాంబ శివరావు

టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబ శివరావు .. పార్టీ మారబోతున్నాడని వార్తలు జోరుగా అందుకున్నాయి. మొన్న ఆ మధ్య రాయపాటి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ పాలనా బాగుందని .. నవరత్నాలు ప్రజలకు చేరువయితే జగన్ ప్రజా నాయకుడిగా కీర్తించబడతాడని .. జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు.నవరత్నాల అమలకు నిధుల కొరత ఉందని .. కేంద్రం సహకరించడం లేదని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజుల నుంచి రాయపాటి పార్టీ మారబోతున్నాడని ఒకటే టాక్ నడుస్తుంది. నిజానికి ఈ  టాక్ ఎన్నికల ముందు కూడా వచ్చింది. కానీ ఎందుకో గాని రాయపాటి ఎన్నకలప్పుడు పార్టీ మారలేదు. ఇప్పుడు రాయపాటి వ్యాఖ్యలను చూస్తుంటే .. ఖచ్చితంగా వైసీపీ లోకి చేరడానికి హింట్ ఇస్తున్నాడని అర్ధం అవుతుంది. అయితే బీజేపీ పార్టీలోకి చేరతాడన్న ఊహాగానాలకు తెర పడిందని చెప్పాలి. రాయపాటి మూడ్ చేస్తుంటే వైసీపీ గూటికే చేరేందుకు ఇష్ట పడుతున్నారు. అయితే మొన్న రాయపాటి .. దక్షిణాన మొదట కేసీఆర్ సర్కార్ ను .. తరువాత జగన్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందని బాంబు కూడా  పేల్చారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.