(Local) Sat, 23 Jan, 2021

మన తీరం పదిలం

October 22, 2019,   3:22 PM IST
Share on:
మన తీరం పదిలం

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిల్లీలో జరుగుతున్న నావెల్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత నావికాదళం నిఘా నీడలో దేశ తీర ప్రాంతమంతా భద్రంగా ఉందని అన్నారు. 26/11 లాంటి దాడులు మరోసారి జరగకుండా నేవీ పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్‌ ఎప్పుడూ తప్పులు చేయలేదని, కావాలని ఏ దేశంపైనా దాడికి పాల్పడి పరాయి భూమిని కనీసం అంగుళం కూడా బలవంతంగా లాక్కోలేదని అన్నారు. కానీ, భారత్‌ను తప్పుడు దృష్టితో చూసేవారికి తగిన గుణపాఠం చెప్పే సామర్ధ్యం మన సాయుధ బలగాలకు ఉందని, భారత నేవీ నిఘా నీడలో సముద్రమార్గం అత్యంత సురక్షితంగా ఉందని అన్నారు. ముంబయి దాడుల వంటి ఘటనలు మరోసారి జరగకుండా నావికాదళం చర్యలు తీసుకుంటోందని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.