(Local) Thu, 03 Dec, 2020

కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి

August 27, 2019,   1:19 PM IST
Share on:
కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి

ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ ముగ్గురు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. వరదలతో వాయనాడ్ ప్రాంతం మరింత ఎక్కువగా నష్టపోయిందని గుర్తు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ,రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ లకు ఈ మేరకు రాహుల్ విడివిడిగా లేఖలు రాశారు. దాదాపు నెల రోజుల పాటు వరద బీభత్సం కొనసాగిందని గుర్తు చేసిన రాహుల్, 125 మంది ప్రాణాలు కోల్పోయారని, 16 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, వరుసగా రెండో సంవత్సరం వరదలు ముంచెత్తాయని అన్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ స్కీమ్ కింద ప్రస్తుతమున్న 100 రోజుల ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని ఆయన సూచించారు.

సంబంధిత వర్గం
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.