(Local) Sun, 18 Apr, 2021

రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట

November 14, 2019,   12:22 PM IST
Share on:
రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట

రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో ప్రధాని మోదీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ మోదీని ఉద్దేశిస్తూ “చౌకీదార్ చోర్ హై” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ పరువు నష్టం దావా వేసింది. గతంలోనే ఈ కేసు విచారణ సమయంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు రాహుల్ పై దాఖలైన పరువు నష్టం దావా పిటిషన్ ను నేడు కొట్టివేసింది. రాహుల్ ఇక నుంచి సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని కోర్టు సూచించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.