(Local) Sun, 20 Sep, 2020

ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధించిన కాంగ్రెస్ ఎమ్యెల్యే

August 06, 2019,   1:39 PM IST
Share on:
ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధించిన కాంగ్రెస్ ఎమ్యెల్ ...

ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాయ్‌బరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ సమర్థించారు. ఈ నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉందన్నారు. 370 రద్దును రాజకీయం చేయొద్దని అదితి సూచించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆమె కొనియాడారు. ఒక ఎమ్మెల్యేగా 370 అధికరణ రద్దును స్వాగతిస్తున్నానని అదితి సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ వైఖరితో సొంత పార్టీ నేతలు కంగు తిన్నారు. అదితి సింగ్‌తో పాటు మరికొందరు నేతలు పార్టీ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు.

సంబంధిత వర్గం
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.