(Local) Sat, 24 Jul, 2021

ప్రయోగానికి సిద్ధమైన పొలార్​ శాటిలైట్​ వెహికల్​-సి 47

November 26, 2019,   11:13 AM IST
Share on:
ప్రయోగానికి సిద్ధమైన పొలార్​ శాటిలైట్​  వెహికల్​-స ...

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్​ ధవన్​ స్పేస్​ సెంటర్​ షార్​లో పొలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్​-సి 47 ప్రయోగానికి సిద్ధమైంది. ప్రయోగానికి ముందు నిర్వహించే పరీక్షలు, తనిఖీలను శని, ఆదివారాల్లో శాస్త్రవేత్తలు నిర్వహించారు. నిన్న ప్రయోగానికి రిహార్సల్​ చేశారు  రాకెట్​ సన్నద్ధత, ల్యాబ్​ సమావేశాలు జరిగాయి . మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్​డౌన్​ ప్రారంభం అయ్యింది .

1625 కిలోల బరువు ఉన్న కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ద్వారా 14 ఉపగ్రహాలను 509 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. పోలార్ శాటిలైట్ లంచ్ వెహికిల్ స సిరీస్ లో ఇది 49వ ప్రయోగం కాగా.. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ను ఎక్స్ ఎల్(XL) తరహాలో రూపొందించారు.

శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగం జరుపనున్నారు. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. ఐదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందించే కార్బోషాట్-3 రెండు వేల వాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం తర్వాత మరో రెండు ఉపగ్రహాలను షార్ నుంచి డిసెంబర్ లో ప్రయోగించే అవకాశం ఉన్నది.

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.