(Local) Tue, 07 Jul, 2020

గురుద్వారాలో రోటీలు తయారుచేసిన ప్రిన్స్‌ ఛార్లెస్

November 14, 2019,   3:47 PM IST
Share on:
గురుద్వారాలో రోటీలు తయారుచేసిన ప్రిన్స్‌ ఛార్లెస్

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్ రెండురోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆయన గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికింది. అనంతరం అక్కడి సిక్కులతో కలిసి ముచ్చటించారు. వారితో ఫొటోలు కూడా దిగారు. ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు. గురునానక్‌ 550వ జయంతి సమయంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రిన్స్‌ ఛార్లెస్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రావడం ఇది పదోసారి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.