(Local) Wed, 20 Oct, 2021

అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

September 14, 2019,   10:41 AM IST
Share on:
అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని మోదీ గురువారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పింఛను పథకాలను ప్రారంభించారు. రూ.465 కోట్లతో నిర్మించిన జార్ఖండ్‌ అసెంబ్లీ నూతన భవనాన్ని, మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. దుకాణదారుల కోసం ‘ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ ధన్‌ యోజన’, స్వయం ఉపాధిదారుల కోసం ‘స్వరోజ్‌గార్‌’ పింఛను పథకాలను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఎన్డీయే 2.0 హయాంలో తొలి 100 రోజుల్లోనే జమ్ము, కశ్మీరు, లద్దాఖ్‌ను అభివృద్ధి చేయాలన్నా లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. అలాగే అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే తమ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు, అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేసేందుకు ప్రతిన బూనామని తెలిపారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.