(Local) Thu, 24 Sep, 2020

జైట్లీ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోడి

August 24, 2019,   2:20 PM IST
Share on:
జైట్లీ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోడి

 బిజెపి సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ(66) కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈరోజున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా అబుధాబీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి జైట్లీ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఒక రాజకీయ దిగ్గజమని, ఆయన ఒక గొప్ప మేధావని 
మోడి ఆయనను ప్రశంసించారు. భారతదేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని మోడి కొనియాడారు. జైట్లీ కన్నుమూయడం చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. జైట్లీ భార్య సంగీతతో పాటు కొడుకు రోహన్‌తో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు మోడి సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.