(Local) Sun, 20 Oct, 2019

అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణ...

September 23, 2019,   7:52 PM IST
Share on:
అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణ...

అమెరికాలోని హూస్టన్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమానికి హాజరైన సెనెటర్ జాన్ కార్నిన్ భార్యకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం జాన్ కార్నిన్ భార్య శాండీ పుట్టినరోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున జాన్ తన భార్యతో సమయం గడపకుండా తనతో ఉండటంతో మోదీ ఆమెను క్షమాపణ కోరారు. హౌడీ మోదీ కార్యక్రమానికి జాన్ కార్నిన్ భార్య కూడా హాజరయ్యారు. సభ తరువాత శాండీతో మాట్లాడుతూ.. మీకు నేను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మీ పుట్టినరోజు. కానీ, మీ భర్త నాతో ఉండాల్సివచ్చింది. అందువల్ల సహజంగానే మీకు అసూయగా ఉండి ఉంటుంది అని మోదీ అన్నారు. తరువాత జాన్ కార్నిన్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటనకు సంబందించిన వీడియోను భారత ప్రధాన కార్యాలయం ట్విటర్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. 

సంబంధిత వర్గం
ట్రంప్‌ రిసార్దులో జీ-7 అధినేతల సదస్సు
ట్రంప్‌ రిసార్దులో జీ-7 అధినేతల సదస్సు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.