(Local) Fri, 17 Sep, 2021

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి

August 14, 2019,   10:03 AM IST
Share on:
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపత ...

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక, మానవ తప్పిదాల కారణంగా మార్కుల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. కొందరికి బాగా ఎక్కువగా మార్కులు రాగా, మరికొందరికి బాగా తక్కువగా వచ్చాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారు.మార్కులు చూసి మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొత్తంగా 27 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ చీఫ్ కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు గత నెల 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదని, తప్పిదాలకు పాల్పడిన ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రపతికి అందించారు.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.