(Local) Mon, 18 Oct, 2021

రాష్ట్రపతి కోవింద్ స్వాతంత్య్ర సందేశం

August 15, 2019,   10:42 AM IST
Share on:
రాష్ట్రపతి కోవింద్ స్వాతంత్య్ర సందేశం

భారతదేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ 370వ అధికరణ ఎత్తివేత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది మంచి పరిణామమే అని, దీనితో జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇతోధిక ప్రయోజనాలు సమకూరుతాయని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ లడఖ్‌కు సంబంధించి ఇటీవల పార్లమెంట్ ద్వారా చేసిన మార్పులు చేర్పుల వల్ల అక్కడి పౌరులు తమ హక్కులను ఎప్పటిలాగానే పొందగల్గుతారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ఉండే అన్ని అధికారాలను , సకల సౌకర్యాలను సంతరించుకుంటారని రాష్ట్రపతి తెలిపారు. మొత్తం మీద కశ్మీరం జాతి జనజీవన స్రవంతిలో అంతర్భాగం అవుతుందని, రాబోయే మంచి రోజులకు ఇదో సంకేతం అని చెప్పారు. కశ్మీరీలు, జమ్మూవారు, లడఖ్ ప్రాంతీయులు మరిన్ని అవకాశాలను పొందుతారని, ప్రజా సంక్షేమం భవిత కోణంలో ఇదో కీలక నిర్ణయం అన్నారు.

సంబంధిత వర్గం
వీసా లేకుండా బ్రెజిల్‌కు!
వీసా లేకుండా బ్రెజిల్‌కు!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.