(Local) Fri, 23 Jul, 2021

మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం నేరమా!

November 18, 2019,   6:52 PM IST
Share on:
మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం నేరమా!

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం రితాలా అసెంబ్లీ పరిధిలో రహదారి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ భాజపా నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వారికి మింగుడు పడడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే దిల్లీ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా కల్పించిందని భాజపా నాయకులు చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. గుజరాత్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి కోసం రూ.191 కోట్లతో విమానాన్ని కొనడాన్ని ఉద్దేశిస్తూ తాము అలా విమానాలను కొనుగోలు చేయడంలేదని, మహిళలకు ఉచిత రవాణా మాత్రమే కల్పించామని, వారికి అది కూడా నచ్చడం లేదని అన్నారు. ఎంపీలు 4వేల యూనిట్ల కరెంటును ఉచితంగా ఉపయోగించుకుంటుండగా, తాము ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తే వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.