(Local) Sat, 04 Apr, 2020

ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ

November 22, 2019,   1:49 PM IST
Share on:
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ

ఈనెల 14న హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ తో పాటు, మధ్య ప్రదేశ్ కు చెందిన వారిలాల్ ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. వీసా లేకుండా అక్రమంగా తమ దేశంలోకి అడుగు పెట్టారని ఆరోపిస్తూ పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ 2016-17లో ఇద్దరు భారతీయులు పాక్ చెరలో అడుగుపెట్టారనే సమాచారం అందిందని, అప్పుడే ఈ విషయంపై పాకిస్థాన్ అధికారులకు సమాచారం అందించామన్నారు. అప్పటి నుంచి పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని.. అకస్మాత్తుగా ప్రకటన రావడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయంపై పాకిస్థాన్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. పాక్ చేస్తున్న అసత్య ప్రచారానికి వీరు బలి కాబోరని.. వీరికి కాన్సులర్ యాక్సెస్ కల్పించాలనని కోరినట్లు తెలిపారు. వీరిని తిరిగి రప్పించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వీరి బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. ఇదరికీ హానీ కలగకుండా సురక్షితంగా స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.