(Local) Fri, 22 Oct, 2021

జూడాలపై పోలీసుల తీరు సరి కాదు -పవన్

August 08, 2019,   1:20 PM IST
Share on:
జూడాలపై పోలీసుల తీరు సరి కాదు -పవన్

జూనియర్ డాక్టర్ పై డీసీపీ హర్షవర్దన్ చేయి చేసుకోవడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ ఎన్టీర్ హెల్త్ వర్సిటీ దగ్గర ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు పేదలకు సేవలు అందిస్తున్నారని, వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. ఇలా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. విజయవాడ, తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.