(Local) Thu, 21 Nov, 2019

పోలవరం పై రంగంలోకి కేంద్రం

August 20, 2019,   11:13 AM IST
Share on:
పోలవరం పై రంగంలోకి కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం రంగలోకి దిగింది. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంపై, తాజా పరిణామాలపై ఆరా తీసింది. ప్రాజెక్ట్  నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ (పీపీఏ)ని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా ఏపీ సర్కార్ పోలవరం టెండర్లు రద్దు చేయడమీ కాకుండా , రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తమకు పూర్తి వివరాలను అందించాలని పీపీఏను కేంద్రం కోరింది.

రివర్స్ టెండరింగ్ వద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లెటర్ రాసింది. లేఖ రాసిన తర్వాతి రోజే రివర్స్ టెండరింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీని పై కేంద్ర సీరియస్ అయ్యింది. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం నిర్మాణం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. దీని పై ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వర్గం
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.