(Local) Wed, 28 Jul, 2021

వీసా లేకుండా బ్రెజిల్‌కు!

November 14, 2019,   1:45 PM IST
Share on:
వీసా లేకుండా బ్రెజిల్‌కు!

ప్రధాని నరేంద్రమోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ పర్యటకు వెళ్లిన నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బొల్సొనారోతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను 2020 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ప్రధాని ఆహ్వానంపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించారు. కాగా బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశం అయిన నేపథ్యంలో భారత విదేశాంగశాఖ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమైనట్లు వెల్లడించింది. భారతీయులు వీసా లేకుండా బ్రెజిల్‌కు వెళ్లేందుకు వీలుకల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.