(Local) Mon, 18 Oct, 2021

డిస్కవరీ లో నేడు మోదీ సాహసాల ఎపిసోడ్ ప్రసారం

August 12, 2019,   1:10 PM IST
Share on:
డిస్కవరీ లో నేడు మోదీ సాహసాల ఎపిసోడ్  ప్రసారం

డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసే వరల్డ్ పాపులర్ షో ‘మేన్ వర్సెస్ వైల్డ్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించబోతున్నారు. దీనికి సంబందించిన ప్రోమోను ఆ ఛానెల్ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రోమోకు  ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ ఎపిసోడ్ ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించిన ఎపిసోడ్ అవుతుందని ‘మేన్ వర్సెస్ వైల్డ్‌’లో రెగ్యులర్‌గా కనిపించే సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌ వ్యాఖ్యానించారు.

ఈరోజు (ఆగస్ట్ 12 )రాత్రి9 గంటలకు డిస్కవరీ ఛానల్ మోదీ సాహసాల ఎపిసోడ్‌ను ప్రసారం చేయనుంది. డిస్కవరీ ఛానల్‌తో పాటు మొత్తం 12 ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మోదీ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో మోదీ… ఇండియాలోని వన్యప్రాణులు, వాటిని ఎలా సంరక్షించాలి, పర్యావరణ మార్పులపై వివరించబోతున్నారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.