(Local) Wed, 18 Sep, 2019

జి-7 సదస్సు లో డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్న నరేంద్ర మోడీ

August 26, 2019,   10:26 AM IST
Views: 80
Share on:
జి-7 సదస్సు లో  డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్న న ...

ఫ్రాన్స్‌లో జరగనున్న జి-7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు మోడీ, ట్రంప్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతల మధ్య 40 నిమిషాలపాటు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఉపఖండ పరిస్థితులపై మోడీ, ట్రంప్‌ చర్చిస్తారని సమాచారం. 370 అధికరణం రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న పాక్‌ వైఖరిపై చర్చ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. వీటితో పాటు.. వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై మోడీ, ట్రంప్‌ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. 

సంబంధిత వర్గం
జకీర్ నాయక్‌ ను అప్పగించమని మోడీ కోరలేదు - మలేసియా ...
జకీర్ నాయక్‌ ను అప్పగించమని మోడీ కోరలేదు - మలేసియా ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.