(Local) Mon, 23 Sep, 2019

స్పష్టమైన విధానం వల్లే ...మార్పులు సంభవించాయి - మోడీ

August 14, 2019,   1:23 PM IST
Views: 141
Share on:
స్పష్టమైన విధానం వల్లే ...మార్పులు సంభవించాయి  - మ ...

యూపీఏ సర్కారు రెండో సారి అధికారంచేపట్టి 75 రోజులు గడిచిన సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ ఐఏఎన్ఎస్(IANS) కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధ్యతలను చేపట్టిన కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని, తమకు స్పష్టమైన విధానం, మంచి ఉద్దేశాలు ఉండటం వల్లే మార్పులు సంభవించాయని అన్నారు.ఇండియాలో చిన్నారులకు భద్రత నుంచి చంద్రయాన్‌-2 వరకు, అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళకు రక్షగా ఉండే ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వరకు ఎన్నో తెచ్చాం. ఆర్టికల్ 370 రద్దు నుంచి రైతు సంక్షేమం వరకు… ప్రజల తరఫున పనిచేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం మాది. మేము ఏమి చేయగలమని ప్రజలు అనుకున్నారో, అంతకన్నా ఎక్కువే చేసి చూపించాం అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో విదేశాంగ శాఖ మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్‌ ను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రొటోకాల్‌ స్థాయి అధికారులు కూడా ప్రజల పిలుపునకు స్పందించేలా తన కార్యాలయాన్ని ఆమె మార్చారని కొనియాడారు. 2014లో ఐక్యరాజ్యసమితి సభలో తాను ప్రసంగించాల్సిన సమయంలో సుష్మతో జరిగిన సంభాషణను ఆయన పంచుకున్నారు. నాటి సమావేశంలో ఏం మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారని, తాను ప్రసంగాలను ముందుగానే రాసుకోబోనని చెప్పగా, అది కుదరదని, ఇండియా గురించి చెప్పేటప్పుడు మీకు నచ్చినట్లు ప్రసంగించడానికి వీల్లేదని ఆమె పట్టుబట్టారని అన్నారు. ఎంత గొప్ప వక్తలైనా కొన్ని చోట్ల చూసి చదవాల్సిందేనని ఆమె అనేవారని, తాను కూడా దాన్నే అనుసరించానని చెప్పారు.

సంబంధిత వర్గం
మోడీ కోసం 'నమో థాలిస్'
మోడీ కోసం 'నమో థాలిస్'

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.