(Local) Sun, 20 Oct, 2019

మలేషియా ప్రధానితో ప్రధాని మోడీ భేటీ

September 06, 2019,   3:28 PM IST
Share on:
మలేషియా ప్రధానితో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని నరేంద్రమోదీ తూర్పు దేశాల ఆర్థిక సదస్సు కోసం రష్యా వెళ్లిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మోడీ  వ్లాడివోస్టాక్‌లో మలేషియా ప్రధాని మహతీర్ బిన్ మహ్మద్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రత్యేకించి వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్ అప్పగింతపై చర్చ జరిగింది. జమ్మూ కశ్మీర్‌పై చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల భేటీపై విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడుతూ, మోదీ ప్రముఖంగా జకీర్ నాయక్ అప్పగింత విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. భారత్‌కు ఇది అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి ఈ అంశంపై ఇరు దేశాల అధికారులు సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారని వెల్లడిచారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'NarendraModi|MahathirMohamad|ZakirNaik|EasternEconomicForum|VijayGokhale|ModionZ' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.