(Local) Mon, 12 Apr, 2021

కంటతడి పెట్టిన ఇస్రో చైర్మన్ - ధైర్యం చెప్పిన మోడీ

September 07, 2019,   10:12 AM IST
Share on:
కంటతడి పెట్టిన ఇస్రో చైర్మన్ - ధైర్యం చెప్పిన మోడీ

ISRO అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో నిశబ్ధం ఆవరించింది . ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మోడి ప్రసంగించిన తర్వాత ఆయన వద్దకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. అంతకు ముందు మోదీ ప్రసంగిస్తూ, చంద్రుడిని తాకాలనే మన ఆకాంక్ష ఇప్పుడు మరింత బలపడిందని… రానున్న రోజుల్లో మనం ఘన విజయాలను సాధిస్తామని అన్నారు.

సంబంధిత వర్గం
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.