(Local) Fri, 22 Oct, 2021

పెట్టుబడులకు భారతదేశం అనుకూలం

November 04, 2019,   2:40 PM IST
Share on:
పెట్టుబడులకు భారతదేశం అనుకూలం

పలు రకాల సంస్కరణల ద్వారా భారతదేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం తీసుకువచ్చామని ప్రధాని మోడి పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి తరుణమని ఆయన విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్‌ వెళ్లిన ఆయన బ్యాంకాక్‌లో నిర్వహించిన ఆదిత్యాబిర్లా గ్రూప్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నిత్యకృత్యంగా, అధికారిక పద్ధతిలో పనిచేయడాన్ని తమ ప్రభుత్వం స్వస్తి పలికిందని అన్నారు. పనివిధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని, తద్వారా భారత్‌ ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పన్ను సంస్కరణలను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రస్తుతం దేశంలో తక్కువ పన్ను విధానం నడుస్తోందని, దీన్ని వినియోగించుకోవా లని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరి శ్రమల స్థాపనకు ఎటువంటి అడ్డంకులు, వేధింపులు ఉండవని పేర్కొన్నారు. నేడు దేశాభివృద్ధికి పన్ను చెల్లింపుదారుడి సహకారం ఎంతో విలువైనదని మోడీ అన్నారు. పన్ను విధానంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని మరింత ముందుకు తీసుకుపోతామని మోడి తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.