(Local) Thu, 24 Sep, 2020

భారత్‌- ఫ్రాన్స్‌ కష్టనష్టాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి

August 24, 2019,   11:11 AM IST
Share on:
భారత్‌- ఫ్రాన్స్‌ కష్టనష్టాల్లో  పరస్పరం సహకరించుక ...

భారత ప్రధాని నరేంద్రమోడి మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కాదని.. కష్టనష్టాల్లో ఈ రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయిన మోడి అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను ఫ్రాన్స్‌ వచ్చినపుడు వేలాదిమంది భారతీయులు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. నవభారత్‌ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగే కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానముందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్‌ వేగంగా దూసుకెళ్తోందన్నారు. సేవ చేసేందుకు దేశ ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని చెప్పారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.