(Local) Fri, 26 Feb, 2021

కర్తార్‌పూర్‌ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి

November 18, 2019,   6:48 PM IST
Share on:
కర్తార్‌పూర్‌ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి

ప్రముఖ సిక్కుల పుణ్య క్షేత్రం కర్తార్‌పూర్‌కు భారత్‌ నుంచి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 9న కర్తార్‌పూర్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని సిక్కు భక్తుల సౌకర్యార్థం దీన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వెళ్లే సిక్కు యాత్రికుల సంఖ్య క్రమంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీన్ని ప్రారంభించిన రోజు 562 మంది దర్శించుకోగా, గురునానక్‌ జయంతి రోజు 546 మంది దర్శించుకున్నారు. ఇక సాధారణ రోజుల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వచ్చే ఆదివారం సుమారు 1,800 మంది భక్తులు కర్షార్‌పూర్‌కు రావడానికి పేర్లు నమోదు చేసుకున్నట్లుగ్గా అధికారులు  తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.