(Local) Fri, 05 Jun, 2020

జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధితో పిఒకె మనదే - సత్యపాల్‌ మాలిక్‌

September 19, 2019,   4:10 PM IST
Share on:
జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధితో పిఒకె మనదే  - సత్యపా ...

జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధి చూసి పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె) ప్రజలు భారత్‌లో చేరడానికి ముందుకు వస్తారని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. పిఒకెను విలీనం చేసుకోవడానికి భారత్‌ ఎలాంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని, అక్కడి ప్రజల్లో విశ్వాసం కలిగిస్తే వారే భారత్‌లో చేరడానికి వస్తారని ఆయన అన్నారు. ”గత పది, పదిహేను రోజులనుంచి గమనిస్తున్నాను. మన మంత్రులు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడటానికి అవకాశం లేక, పిఒకెను స్వాధీనం చేసుకోవాలంటూ పదేపదే మాట్లాడుతున్నారు. పిఒకె మన తదుపరి లక్ష్యమని నా భావన. జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధి ద్వారా దానిని మనం తీసుకోవచ్చు” అని సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.