(Local) Fri, 30 Oct, 2020

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్

November 18, 2019,   7:18 PM IST
Share on:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్

రాష్ట్రంలో ఇసుక సమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు. సీఎంకు నిజాలు తెలిసేలా సహకరించిన మీడియా, రాజకీయ ప్రతినిధులకు పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇసుక అందుబాటులోకి రావడంతో పంపిణీ కేంద్రాల సమచారంపై ఓ ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన ప్రకటనను పవన్ ట్వీట్టర్ లో ఉంచారు. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 50లక్షల మందికి పైగా ఉపాధి కోల్పోయారని, 50మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చినప్పటికీ అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.