(Local) Thu, 24 Sep, 2020

అమరావతిపై పవన్ కల్యాణ్ స్పందన

August 25, 2019,   12:44 PM IST
Share on:
అమరావతిపై  పవన్ కల్యాణ్  స్పందన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శనివారం హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. అమరావతి తరలింపుపై వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. ఇటీవల మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, రాష్ట్రమంతటిదన్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటే పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. ఈనెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలిస్తానని పవన్ వెల్లడించారు.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.