(Local) Sun, 20 Jun, 2021

సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు

November 15, 2019,   11:39 AM IST
Share on:
సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు

వైసీపీ పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ .. “నన్ను పవన్ నాయుడు అని పిలుస్తున్నారు. పేరులో లేని పదాలను ఆపాదించడం మానుకోవాలి. ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతిలో లేదు. కానీ ఎలా ప్రవర్తించాలో మన చేతిలోనే ఉంది. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కొట్టుకుపోతారని ఉద్దేశ్యపూర్వకంగానే అన్నాను. దీనికి బొత్స సత్యనారాయణ తెగ బాధపడిపోతున్నారు. నేను బొత్స నాయుడు అంటే ఊరుకుంటారా. ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి. విడిపోయిన వారి గురించి మాట్లాడడానికి ఇంగిత జ్ఞానం లేదా. వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి  అని జాతీయ పేపర్లు, ఛానల్ లు పిలవడం లేదా. జగన్ ను ఏమని పిలవాలో 151 మంది ఎమ్మెల్యేలు తీర్మాణం చేసి చెప్పండి. అలానే పిలుస్తాం.” అని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.