(Local) Wed, 03 Jun, 2020

ప్రాణం పోయినా పార్టీని విలీనం చెయ్యను -పవన్ కళ్యాణ్

August 05, 2019,   10:48 AM IST
Share on:
ప్రాణం పోయినా పార్టీని విలీనం చెయ్యను -పవన్ కళ్యాణ ...

జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.జనసేనను బీజేపీలో విలీనం చేస్తానంటూ కొందరు అంటున్నారని  కానీ  ప్రాణం పోయినా బీజేపీలో జనసేనను కలపను అని పవన్ తేల్చి చెప్పారు. ప్రజల కోసం, బాధ్యతాయుతమైన రాజకీయాల కోసం జనసేన పార్టీని నడిపిస్తాను అని పవన్ చెప్పారు. భీమవరంలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీలో నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు జనసేన పార్టీ ఉంటుందని పవన్ అన్నారు. రౌడీయిజం, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. ఓటమిని గర్వంగా తీసుకుంటున్నానని చెప్పారు. తప్పు చేస్తే క్షమించమని అడిగే సంస్కారం తనకుందన్నారు.

తాను గెలవాలనుకుంటే ప్రజారాజ్యంలోనే ఎంపీగా పోటీ చేసేవాడిని చెప్పారు. గతంలో తన మాటలను కొంతమంది వక్రీకరించారని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం పనితీరును వంద రోజులు వేచి చూద్దామన్నారు పవన్. అనుకూల పరిస్థితుల్లో బలం లేని వారు కూడా బలంగా కనిపిస్తారని.. ప్రతికూల పరిస్థితుల్లో బలంగా ఉన్నవారు చతికిల పడిపోతారని పవన్ అన్నారు. మనకంటూ ఒక రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను తప్పు మాట్లాడితే క్షమించమని కోరతాను అన్న పవన్.. తప్పు చేయకపోతే చేతులు ముడుచుకుని కూర్చోనని స్పష్టం చేశారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు పవన్.

పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం లేదని, టన్నుల కొద్దీ ఆశయం ఉంటే చాలన్నారు. విజయం రావడానికి దశాబ్దం పట్టొచ్చని, భీమవరంలో ఓడాం, గాజువాకలో ఓడాం అని ఆగిపోతే భవిష్యత్తులో వచ్చే విజయాలను తీసుకోలేమన్నారు.మద్యపాన నిషేధంపై తాను ఎప్పుడో మాట్లాడిన మాటలను పట్టుకుని కొందరు తన ఇంటి మీద దాడికి ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వారు టీఆర్ఎస్ వ్యక్తులో, కార్యకర్తో తనకు తెలియదని, వారు తన ఇంటి మీద దాడికి ప్రయత్నించారన్నారు. ఏదైనా ఉంటే మీడియా ద్వారా ఖండించాలి కానీ, ఇలా ఇంటి మీద దాడులకు దిగడం మంచిది కాదన్నారు.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.