(Local) Wed, 28 Jul, 2021

సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

November 21, 2019,   12:45 PM IST
Share on:
సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ కార్మికులను సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని కోరారు. విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున ఆంక్షలు లేకుండా చేర్చుకోవాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నా, 45రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధుల్లోకి హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర సీఎం తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నా అని.. దీని ద్వారా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని.. దీన్ని అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.