(Local) Mon, 26 Aug, 2019

ఆర్టికల్ 370ని రద్దుచేయడం సాహసోపేతమైన నిర్ణయం - పవన్ కల్యాణ్

August 06, 2019,   12:19 PM IST
Share on:

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని కేంద్రం రద్దుచేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయంతో అత్యంత సౌదర్యవంతమైన కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాని పవన్ కల్యాణ్ అన్నారు . భీమవరంలో సోమవారం సాయంత్రం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని పాలకొల్లు, తణుకు,ఆచంట నియోజకవర్గ జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ...అఖండ భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన హింసలో రెండు ప్రాంతాల నుంచి లక్షల మంది చనిపోయారని చదవినపుడు హృదయం వేదనకు గురైంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నాను. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను అని ఒక ప్రకటనలో పవన్ కల్యాణ్ తెలిపారు  .

 

సంబంధిత వర్గం

అమరావతిపై పవన్ కల్యాణ్ స్పందన

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.