(Local) Mon, 01 Jun, 2020

వరద బాధితులను ఆదుకోవాలని పవన్‌ పిలుపు

August 04, 2019,   7:06 PM IST
Share on:
వరద బాధితులను ఆదుకోవాలని పవన్‌ పిలుపు

గోదావరి వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసైనికులకు జనసేనాని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించాలన్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని, వరద బాధితులకు అండగా నిలవాలని పవన్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ పర్యటిస్తున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా పవన్ భీమవరం చేరుకున్నారు. సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర పవన్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భీమవరంలో జనసేన కార్యకర్తలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల తర్వాత భీమవరం నుంచి తొలిసారి పార్టీ సమావేశాలను ప్రారంభించారు పవన్ కల్యాణ్.

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు పవన్ పర్యటిస్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పవన్ తెలిపారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు భవిష్యత్ లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జగన్ ప్రభుత్వం తీరు, ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారనే విషయంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలిసింది. రాజకీయాలు హుందాగా ఉండాలన్నదే తమ పార్టీ అభిమతం అని పవన్ స్పష్టం చేశారు

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.