(Local) Mon, 09 Dec, 2019

మ‌హాన్యూస్ ఛాన‌ల్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న పరకాల

November 14, 2019,   2:07 PM IST
Share on:
మ‌హాన్యూస్ ఛాన‌ల్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న పరకాల

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్..కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అన్న విషయం  విదితమే. ఇంతకుముందు ఈయన చంద్ర‌బాబుకి క‌మ్యూనికేష‌న్ స‌ల‌హాదారుడిగా ప‌నిచేశారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వ స‌లహాదారు ప‌ద‌వీ కాలం ముగిసింది. మ‌ళ్లీ ఆయ‌న‌కు రెన్యూవ‌ల్ రాకపోవ‌డంతో సొంత వ్య‌వ‌హారాల్లో మునిగారు. కొంత‌కాలం వెబ్‌సైట్ న‌డిపారు. ఇప్పుడు టీవీ స్క్రీన్ తెర‌పైకి రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే నెల ఒక‌టి నుంచి ఆయ‌న మ‌హా న్యూస్ లో కనిపించనున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజ‌నాచౌదరి తిరిగి మ‌హాటీవీని సొంతం చేసుకున్నార‌ని స‌మాచారం. మహాటీవీ బాధ్య‌త‌ల‌ను ప‌ర‌కాలకు అప్ప‌గించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌ర‌కాల ఇంట్లో కొత్త టీమ్ కోసం అన్వేష‌ణ జరుగుతోంది. జ‌ర్న‌లిస్టుల కోసం ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతున్నాయి.మ‌హాటీవీని కొత్త‌గా లాంచ్ చేసేందుకు ప‌ర‌కాల టీమ్ ప్ర‌యత్నాలు ప్రారంభించింది. సంగీత ద‌ర్శ‌కుడు క‌ల్యాణి మాలిక్ తో క‌లిసి మహాటీవీ కోసం కొత్తగా  మ్యూజిక్ కంపోజిష‌న్స్ చేప‌ట్టారు. ఈ ఫోటోల‌తో ఇప్పుడు ప‌ర‌కాల ప్ర‌భాకర్ కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై చర్చ జ‌రుగుతోంది.టీడీపీలో ఉన్న‌ప్పుడు కొంత‌కాలం మ‌హాటీవీని సుజ‌నా చౌద‌రి ర‌న్ చేశారు. కానీ ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డంతో ముందుకు పోలేదు. మ‌రీ ఇప్పుడు ప‌ర‌కాల సార‌థ్యంలో ఏవిధంగా దూసుకెళుతుందో చూడాలి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.