(Local) Sat, 06 Jun, 2020

పలాస కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రిని ప్రారంభించిన జగన్

September 06, 2019,   1:07 PM IST
Share on:
పలాస  కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రిని ప్రారంభి ...

శ్రీకాకుళం జిల్లా  పర్యటన సందర్భంగా ఏపి సిఎం జగన్‌ కాశీబుగ్గ రైల్వే మైదానంలో  ఏర్పాటు చేసిన పలుఅభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలను సిఎం ఆవిష్కరించారు. ఉద్దానం ప్రాంతంలోని ప్రజలకు రూ.600 కోట్లతో నిర్మించనున్న పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు, పలాసలో రూ.50కోట్లతో నిర్మించనున్న రెండు వందల పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు, వజ్రపుకొత్తూరూ మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11 కోట్ల 95 లక్షలతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్న రోగుల్లో స్టేజ్‌-3 బాధితుల నుంచే ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘ఇప్పటి వరకు స్టేజ్‌-5 నుంచి బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే మీ ఎమ్మెల్యే (పలాస శాసన సభ్యుడు) స్టేజ్‌-3 నుంచే బాధితులు భారీ మొత్తంలో మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉన్నందున, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నా దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు స్టేజ్‌-3 నుంచి కూడా బాధితులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు  ప్రకటిస్తున్నా’ అంటూ సభాముఖంగా తెలిపారు. అదే విధంగా  రోగులకు, వారి సహాయకులకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తిచేసి రైతులకు ప్రయోజనం సత్వరం అందేలా చూస్తామని తెలిపారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.