(Local) Mon, 12 Apr, 2021

మోదీకి వీటిని గిఫ్ట్‌గా పంపుతా - పాక్ సింగర్ రబీ పిరజాదా

September 05, 2019,   2:53 PM IST
Share on:
మోదీకి వీటిని గిఫ్ట్‌గా పంపుతా - పాక్ సింగర్ రబీ ప ...

షరా మామూలుగానే మళ్ళీ  భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది పాకిస్తాన్ . తాజాగా పాక్ పాపులర్ సింగర్ రబీ పిరజాదా ప్రధాని మోదీపైకి విషపూరిత పాములు వదులుతానంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ వీడియో విమర్శలకు దారి తీసింది.  కొండ చిలువ,మొసళ్లు, విష సర్పాలను తన చేతిలో పట్టుకొని ఓ వీడియో చేసింది. మోదీకి వీటిని గిఫ్ట్‌గా పంపుతానంటూ చెప్పింది. తర్వాత తాను నరకానికైనా వెళ్లేందుకు సిద్ధమంటూ వ్యాఖ్యానించింది.

ఇటువంటి విష సర్పాలు తన వద్ద ఎన్నో ఉన్నాయని వాటిని ఆయనకు పంపిస్తానంటూ చెప్పడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. దేశ ప్రధానిని హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలకు నవ్వు వస్తోందంటూ రిప్లే ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వర్గం
‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును పొందిన మోడ ...
‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును పొందిన మోడ ...
ఆర్టికల్ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ...
ఆర్టికల్ 370ని రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.