(Local) Mon, 02 Aug, 2021

మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన

October 15, 2019,   5:15 PM IST
Share on:
మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన

నియంత్రణరేఖ వెంబడి పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఖస్బా, కిర్నీ సెక్టార్లలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఆర్మీ షెల్లింగ్ లు, మోర్టార్లతో కాల్పులకు దిగింది. ఈ నేపథ్యంలో పాక్ రేంజర్లు చెంసిన కవ్వింపు చర్యలను భారత సైనికులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాకిస్థాన్ తరచూ సరిహద్దు ప్రాంతాల్లో నివశిస్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగుతోంది. ఈ నెల 13వతేదీన కూడా పాక్ కథువా జిల్లా హీరానగర్ సెక్టారులో కాల్పులకు దిగింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. భారత సైనికుల ధాటికి పాక్ సైనికులు తోక ముడిచారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.