(Local) Mon, 30 Nov, 2020

భారత్ రాయబారికి పాక్ సమన్లు

August 06, 2019,   10:36 AM IST
Share on:
భారత్ రాయబారికి పాక్ సమన్లు

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ఖండించింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు పంపింది. జమ్మూకాశ్మీర్, లఢక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ సోమవారం రాజ్యసభలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసిన పరిణామాలపై పాక్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల అభిష్ఠానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని మండిపడింది. భద్రతా మండలి తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించిందని పాకిస్థాన్ అధ్యక్షుడు మండిపడ్డారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.